మూడు నెలల్లో రెండోసారి
ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ వెంకటేశ్వరచారి
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 16,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మేదర్‌బస్తీ హెచ్‌ఎం ఫణిభాస్కర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో వెంకటేశ్వరచారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కులగణన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. ఫణికుమార్ సర్వేకు హజరు కాకపోవడం, కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో విషయం కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి వెళ్లింది.
రెగ్యులర్ విధుల్లోనూ రికార్డుల సమర్పణలో అలసత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఫణిభాస్కర్ గతంలో సస్పెన్షన్‌కు గురై మూడు నెలల కిందటే విధుల్లో చేరగా మళ్లీ సస్పెండ్ అయ్యారు.