calender_icon.png 12 February, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిట్‌మ్యాన్ అదుర్స్

10-02-2025 12:21:35 AM

  1. కటక్‌లో సెంచరీతో కదం తొక్కిన రోహిత్
  2. రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్ విజయభేరి
  3. 2-0తో వన్డే సీరిస్ కైవసం

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కొన్ని నెలలుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లయ అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో చెలరేగి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఇంగ్లిష్ జట్టు నిర్ధేశించిన 305 పరుగుల టార్గెట్‌ను భారత జట్టు అలవోకగా ఛేదించింది.

44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి భారత్ విజయం సాధించింది. ఫలితంగా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో వన్డే సీరిస్‌ను కైవసం చేసుకుంది. విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ హిట్‌మ్యాన్ రోహిత్ 76 బంతుల్లో 7 సిక్సర్లు, 9 ఫోర్లతో సెంచరీ చేశాడు. మొత్తంగా 90 బంతుల్లో 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్సులు) చేశాడు.

శుభ్‌మన్ గిల్ 60 (52 బంతులు) సహాయంతో మొదటి వికెట్ భాగస్వామ్యానికి ఇద్దరు కలిసి 135 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41) రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.