calender_icon.png 2 October, 2024 | 12:56 AM

హిట్లర్.. తర్వాత నెతన్యాహు

01-10-2024 12:31:52 AM

పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఫైర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ‘హిట్లర్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాది నెతన్యాహు’ అని పీడీపీ అధ్య క్షురాలు మెహబూబా ముఫ్తీ అభివర్ణించారు. సోమవారం పీటీఐతో ముఫ్తీ మాట్లాడుతూ.. లెబనాన్, పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిట్లర్ యూదులను చంపడానికి గ్యాస్ ఛాంబర్లను నిర్మించాడు.

అలా గే నెతన్యాహు.. వరుస బాంబు దాడలతో లెబనాన్, పాలస్తీనాను గ్యాస్ ఛాంబర్ల్‌గా మార్చడంతో పాటు వేలాదిమంది చావుకు కారణం అయ్యాడని ఫైర్ అయ్యారు. మహా త్మాగాంధీ కాలం నుంచి భారత్.. పాలస్తీనాకు అండగా నిలుస్తోందని.. అయితే ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలపై ముఫ్తీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా హత్యకు గురైన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను అమరవీరుడిగా పోల్చడంతో పాటు అతడి మృతికి సంతాపంగా ఇటీవల ముఫ్తీ ఒకరోజు ఎన్నికల ప్రాచారాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయిఏత ముఫ్తీ వ్యాఖ్యలు, తీరుపై బీజేపీ సహా పలు పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. భారత్‌లో ఉంటూ ఉగ్రసంస్థలకు ఆమె వంత పాడటం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.