20-02-2025 12:00:00 AM
టాలీవుడ్‌లో స్టార్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు నాని. ప్రస్తు తం ఆయన ‘హిట్3’ సినిమాతో బిజీ గా ఉన్నాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’ సినిమా మొద టి భాగంలో విశ్వక్‌సేన్ అదరగొట్టాడు. కోసం, బాధ కలగలిసిన భావాలను భలేగా పంటించాడు విశ్వక్. ఆ తర్వాత రెండో ‘హిట్’లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు.
దీంతో మూడో ‘హిట్’ ఎలా ఉండబోతోంద న్న విషయమై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నాని హీరోగా మంచి అంచ నాల మధ్య వస్తున్న ‘హిట్3’ టీజర్ కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మేకర్స్ తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 24న మూవీ టీజర్‌ను విడుదల కాబోతున్నట్టు మూ వీ టీమ్ ప్రకటించింది.
ఓ చిన్న వీడియోను వదలటం ద్వారా ఈ విషయా న్ని యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 24.. నాని బర్త్‌డే.. తన అభిమాన హీరో పుట్టిన రోజున టీజర్ చూడబోతున్నామన్న ఆనందం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ఈ చి త్రంలో శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ‘హిట్4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని తెలుస్తోంది. మూడో భాగంలో క్లుమైక్స్‌లో ఆయన కనిపిస్తారని భోగట్టా!