calender_icon.png 18 March, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రోజు కాలేజీకి మాస్‌బంక్ కొట్టేయండి!

17-03-2025 12:45:24 AM

హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయికగా నటించగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందీ సినిమా. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది.

ఇందులో భాగంగా భీమవరంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘మార్చి 28న అందరికీ హాలీడే ఇవ్వాలని కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కోరుతున్నా (నవ్వుతూ). లేదంటే అందరూ మాస్ బంక్ కొట్టండి. మా నిర్మాత రవి చదువుకున్న ఈ కాలేజీకి రావడం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పారు.

శ్రీలీల మాట్లాడుతూ.. ‘చదువుకునే సమయంలో మంచి బ్రేక్ కోసం చూసే సినిమా ఇది’ అన్నారు. డైరెక్టర్ వెంకీ మాట్లాడుతూ.. “మా సినిమా నుంచి విడుదలైన మూడు పాటల్లానే ప్రతి కాలేజీలో మూడు రకాల స్టూడెంట్స్ ఉంటారు. మొదటి రకం బాగా చదివి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ‘వేర్ ఎవర్ యూ గో ఐ ఫాలో..’ అన్నట్లుగా జాబ్స్ కొట్టేశారు. రెండో క్యాటగిరీ ‘వన్ మోర్ టైమ్..’ అంటూ బ్యాక్‌లాగ్స్ రాస్తుంటారు. రవిలాగా మూడో క్యాటగిరీ.. ఆయన ఇంజినీరింగ్ చదివి ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి.. విజయం సాధిస్తారు” అన్నారు.  

ఆ హీరోల నుంచి ఏం దొంగిలిస్తానంటే..? 

భీమవరం ఈవెంట్‌లో యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు హీరోహీరోయిన్ ఆసక్తికరమైన సమాధానాలి చ్చారు. పలువురు తెలుగు సినిమా హీరోల ఫొటోలను చూపిస్తూ.. అవకాశం వస్తే వారి నుంచి ఏ విషయాన్ని దొంగిలనుకుంటున్నారు? అని యాం కర్ ప్రశ్నించింది. దీనికి నితిన్ సమాధానమిస్తూ.. “నాని నుంచి ‘ఈగ’ చిత్రాన్ని తస్కరించాలనుకుంటున్నా.

ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది.. ఆ క్వాలిటీని కూడా దొంగిలించాలి. ఎన్టీఆర్ నుంచి డైలాగ్ డెలివరీ, మహేశ్ బాబు నుంచి అందం, స్వాగ్, పవన్‌కల్యాణ్ నుంచి అన్ని విషయాలు, ప్రభాస్ నుంచి వ్యక్తిత్వం, రాజసం, విజయ్ దేవరకొండ నుంచి రౌడీ క్యారెక్టర్ తీసుకోవాలనుంది” అని చెప్పారు. ‘కాజల్ నుంచి కళ్లు, అనుష్క నుంచి ఎత్తు, వ్యక్తిత్వం తీసుకోవాలనుకుంటున్నా’ అని శ్రీలీల తెలిపింది. టీమ్ ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.