calender_icon.png 24 October, 2024 | 3:58 PM

హిట్ కొట్టేసింది..

12-07-2024 12:05:00 AM

‘కేజీఎఫ్’ చిత్రాలతో కెమెరా ముందుకొచ్చింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి విజయం వచ్చినప్పుడు.. ఇదే ఊపులో డజన్ల కొద్దీ సినిమాలు చేసే అవకాశం ఉంది. ‘రాశి కంటే వాసి’ ముఖ్యం అనుకుందో ఏమో గానీ.. ‘కేజీఎఫ్’ తర్వాత శ్రీనిధి సినిమాల లెక్క ఏమంత పెరగలేదు. తమిళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేసిన ఆమె ‘తెలుసు కదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ఇంకా విడుదలవక ముందే మరో రెండు అవకాశాలను తన చిత్ర‘నిధి’లో వేసుకుందట శ్రీనిధి. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించనున్న ‘హిట్ 3’లో నాయికగా ఈమె ఎంపిక ఖాయమైందని సమాచారం. ‘కేజీఎఫ్’ సిరీస్ నుంచి ‘హిట్’ సిరీస్‌లోకి వచ్చిన ఈ బెంగళూరు భామ రానాతోనూ ఓ సినిమా చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వరుస చూస్తుంటే అవకాశాలు అందుకోవడంలోనే శ్రీనిధి హిట్ కొట్టేసింది అనిపిస్తుంది కదూ..!