calender_icon.png 16 January, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెకార్డులను తాకి ఫ్లాట్‌గా ముగింపు

30-07-2024 01:57:11 AM

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సరికొత్త రికార్డులను తాకి చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బ్యాంకింగ్, ఎల్‌అండ్ టీ షేర్ల అండతో ఉదయం దూసుకెళ్లిన సూచీలు.. ఇంట్రాడేలో సరికొత్త జీవనకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 81,908 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,999.75 పాయింట్ల వద్ద ఆల్టైమ్ గరిష్టాలను తాకాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఫాట్‌గ్గా గా చివరికి ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో శనివరం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. దీంతో దేశీయ మార్కెట్లు కూడా లాభాలతో మొదలయ్యాయి.

సెన్సెక్స్ ఉదయం 81,679 పాయింట్ల (క్రితం ముగింపు 81,332.72) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,135.91 - 81,908.43 మధ్య కదలాడింది. అంటే ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడింది. అయితే   మదుపరులు లాభాల స్వీకరణతో చివరికి 23.12 పా యింట్ల లాభంతో 81,355.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.25 పాయింట్స్ లాభపడి 24,836.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.74గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్ టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీం ద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ షేర్లు లాభపడగా.. టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.26 డాలర్లు, బంగారం ఔన్సు 2391 డాలర్లు చొప్పున ట్రేడవుతున్నాయి.