calender_icon.png 3 April, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిట్ ఆఫీసర్ కౌంట్‌డౌన్ షురూ!

02-04-2025 12:00:00 AM

స్టార్ హీరో నాని నుంచి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్3: ది థర్డ్ కేస్’. ఈ చిత్రం డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని, నాని నిర్మిస్తున్నారు. ‘హిట్’ సిరీస్‌లో మూడో భాగంగా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం వచ్చే మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజా గా మేకర్స్ 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని ఇంటెన్స్ లుక్‌లో సిగరెట్ కాలుస్తూ గన్ గురి పెట్టిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాని పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో ఆయన సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్; సంగీతం: మిక్కీ జే మేయర్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగాల.