హీరో నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా బానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తోంది. నాని హిట్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి కొత్త షెడ్యూల్ తాజాగా కశ్మీర్‌లో ప్రారంభమైంది. కీలక సన్నివేశాలతోపాటు నాని, ఫైటర్స్ టీమ్‌తో కూడిన ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిసున్నారు. ఇప్పటికే నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. 2025, మే 1న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి డీవోపీ: సాను జాన్ వర్గీస్; సంగీతం: మిక్కీ జే మేయర్.