calender_icon.png 28 December, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహోజ్వల పోరాటాల చరిత్ర

27-12-2024 12:00:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, డిసెంబర్ 26 (విజ యక్రాంతి) : భారతదేశ గడ్డపై మ హోజ్వల పోరాటాల, త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100వ ఆవిర్భావ దినోత్సవని పురస్క రించుకొని జిల్లా వ్యాప్తంగా సిపిఐ జెండాలు ఎగురవేసి, కేక్ కట్ చేసి, ర్యాలీలు నిర్వహించి ఘనంగా వేడుకలు జరిగినట్లు వెంకటస్వామి తెలిపారు.

కరీంనగర్‌లోని గీతాభవన్ చౌరస్తా నుండి 100 జండాలతో రెడ్ షర్ట్ వాలంటీర్లతో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్, కూరగాయల మార్కెట్, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా,కమాన్ చౌరస్తా మీదుగా సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కార్యాలయంపై సిపిఐ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఎగురవేశారు.

100 సంవత్సరాల వేడుకల సందర్భంగా సుదీర్ఘ కాలం సీపీఐలో పనిచేస్తూ అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి నేటికీ సిపిఐలో క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉండి ఎందరికో ఆదర్శంగా నిలిచిన సీనియర్ నాయకులను మర్రి వెంకటస్వామి తో పాటు జిల్లా పార్టీ నాయకత్వం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్య్రం నా జన్మ హక్కు అని పోరాటాలు జరుగుతున్న క్రమంలో 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్,

పైడిపెల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పంజాల శ్రీనివాస్  నలువాల సదానందం,సాయవేణి రాయమల్లు, బ్రామాండ్ల పెల్లి యుగేందర్, బూడిద సదాశివ, బోనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, గొడిశీల తిరుపతి గౌడ్, మచ్చ రమేష్, రామారపు వెంకటేష్, లంకదాసరి కళ్యాణ్, గోవిందుల రవి, నాయకులు మురళీ, సంపత్,అంజలి, రమ, హేమంత్, సాగర్, రాము, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.