దోశ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతున్నాయా?... కానీ దోశ ఎవరికి చెందిందనేదానిపై చర్చోపచర్చలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు మనం అంతటా చూస్తున్న దోరగా వేయించిన తరహాలో ఉండే క్రిస్పీ వర్షన్‌ను తయారు చేసింది మాత్రం కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన చెఫ్‌లే.19వ శతాబ్దంలోనే కొన్ని చోట్ల వారు అది తయారుచేశారు. అప్పటివరకు దోశ మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టుగా ఉండేది.1924లో ప్రారంభమైన ఎంటీఆర్ టిఫిన్స్, 1943లో మొదలైన విద్యార్థి భవన్, అప్పటి నుంచి ఇప్పటిదాకా దశాబ్దాలుగా అద్భుతమైన దోశలు తయారు చేస్తున్నాయి.ఉడుపికి చెందిన అనేకమంది చెఫ్‌లు 20వ శతాబ్దం ప్రారంభంలో భారత్‌లోని అనేక నగరాలకు, పట్టణాలకు వలస వెళ్లారు. అలా దోశ భారత దేశంలో ప్రసిద్ధ వంటకంగా మారింది. ముఖ్యంగా మసాలా దోశ అందరికీ అందుబాటులో ఉండే అల్పాహారంగా మారింది.చెన్నైకి చెందిన శరవణ భవన్ 2003లో దుబాయ్‌లో మొదలుపెట్టి అనేక దేశాల్లో దక్షిణ భారత రెస్టారెంట్లు ప్రారంభించింది.