తొలి సారి న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత్
ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న చందంగా మనోళ్లు తయారు చేయించుకున్న స్పిన్ ట్రాక్ మనల్నే దెబ్బకొట్టింది. ఫలితంగా ఏళ్ల చరిత్రకు గండి పడింది. మాకు స్వదేశంలో ఎదురుందా అని విర్రవీగిన భారత్‌కు చుక్కలు కనిపించాయి.
3 సొంత గడ్డపై టెస్టుల్లో వైట్ వాష్‌కు గురైన మూడో కెప్టెన్ రోహిత్
స్పిన్ ఉచ్చుకు బలి
ముంబై: భారత్-న్యూజిలాండ్ మూడో టెస్టులో భారత్‌పై పర్యాటక న్యూజిలాండ్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 3 తేడాతో కైవసం చేసుకుని భారత్‌కు గుండు సున్నా మిగిల్చింది.
కేన్ విలియమ్సన్ వంటి కీలక బ్యాటర్ లేకున్నా న్యూజిలాండ్ భారత్‌కు చుక్కలు చూపించి ప్రతిష్టను పాతాళానికి దిగజార్చింది. బోర్డర్ టోర్నీకి ముందు కోలుకోలేని దెబ్బ తీసింది. 11 వికెట్లతో సత్తా చాటిన అజాజ్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, విల్ యంగ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించాయి.
4వ ఇన్నింగ్స్‌లో నవ్వుల పాలు..
ముందే స్పిన్ ట్రాక్. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్ల ప్రదర్శనతో మాంచి ఊపు మీదున్నాడు. సుందర్, పంత్ పుణ్యమా అని మనకు తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
మన స్పిన్నర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే పరిమితమైంది. ఈజీగా గెలుస్తుందని అంతా అనుకుంటున్న వేళ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాపార్డర్ టపటపా పెవిలి యన్‌కు క్యూ కట్టింది. పంత్ (64) పోరాడినా కానీ భారత్‌కు ఓటమితో పాటు వైట్ వాష్ గండం తప్పలేదు.