calender_icon.png 8 February, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం

08-02-2025 05:33:27 PM

జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి..

భూపాలపల్లి (విజయక్రాంతి): ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడం హర్షించదగ్గ విషయమని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని రాహుల్ గాంధీ, అరవింద్ కిజ్రివాల్ హామీలను ప్రజలు నమ్మలేదని ఆప్, కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో తాజా ఫలితాలను బట్టి అర్థమవుతోందన్నారు.

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయం అని కాంగ్రెస్, ఆప్ ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసిన ప్రజలు వారిని తిరస్కరించి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నారని, గత పార్లమెంట్ ఎన్నికల్లోను ఢిల్లీ ప్రజలు బిజెపి కి పూర్తి మద్దతుని ఇచ్చారని గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రానున్న తెలంగాణ ఏ ఎన్నికలలో ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.