calender_icon.png 15 November, 2024 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానంతో భార్య గొంతుకోశాడు

13-11-2024 12:40:03 AM

  1. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటిచి పరారైన భర్త
  2. బండ్లగూడ హాషమాబాద్‌లో దారుణం

చార్మినార్, నవంబర్ 12: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమె గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశాడు. అనతంరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాంపై పెట్రోల్ పోసి తగలబెట్టి అగ్నిప్ర మాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి కటకటాలపాలయ్యాడు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. బండ్లగూడ హాషామాబాద్‌కు చెందిన ఫయాజ్ ఖురేషీ (25), ఖమర్‌బేగం (23) భార్యభర్తలు. వీరికి ఆరేళ్ల కిత్రం వివాహం జరిగింది. ఇద్దరు సంతానం. ఫయాజ్ ఖురేషి కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఈ మధ్య కాలంలో ఫయాజ్.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరుచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈనెల 11న అర్థరాత్రి మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన ఫయాజ్ కత్తితో భార్య గొంతు కోయడంతో పాటు విచక్షణా రహితంగా ఆమెపై దాడిచేశాడు. అప్పటికే ఆమె మృతిచెందగా ఎవరికీ అనుమానం రాకుండా అగ్నిప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమం లో బైక్‌లోని పెట్రోల్ తీసి భార్య శవంపై పోసి నిప్పటించాడు. అయితే గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఖమర్‌బేగం మంటల్లో పూర్తిగా కాలిపోయి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.