01-03-2025 05:38:39 PM
రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా(అత్వలే)..
ముషీరాబాద్ (విజయక్రాంతి): రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గ నుంచి తమ పార్టీ పోటీ చేయబోతున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మ అన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ ప్రెస్ క్లబ్లో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పద్మకు పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు.
తమ పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి ప్రభుదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు, సెక్రటరీ గోరఖ్ నాథ్ సింగ్, మహిళా విభాగం ఇన్చార్జులు రోజా రాణి, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.