calender_icon.png 9 January, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల సమస్యల సాధనే తన జీవితలక్ష్యం

08-01-2025 08:22:12 PM

పీఆర్టీయూ ఎమ్మెల్సీ అధికార అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్ల సాధన, అభ్యున్నతి తన జీవిత లక్ష్యం అని పీఆర్టీయూ ఎమ్మెల్సీ అధికార అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంకాలం భద్రాద్రి జిల్లా పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన మండల అధ్యక్షుల కార్యదర్శుల ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తనని గెలిపిస్తే ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకక, ఆ పార్టీలలో చేరకుండా కేవలం మన సమస్యల కొరకే కృషి చేస్తానని అన్నారు. 

ప్రభుత్వం ఉద్యోగులను పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, పీఆర్సీని, పెండింగ్ డిఎ లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సీపీఎస్ మరి ఇతర సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వన్ని ఒప్పించి పరిష్కరించే సత్తా తనకే ఉందని, తనని గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... పీఆర్టీయూ ఉపాధ్యాయ ఉద్యోగుల కొరకు నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తూందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ.. పీఆర్టీయూ అధికార అభ్యర్థి శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర మండల నాయకులు జహంగీర్, షరీఫ్, నర్సయ్య, రవీందర్, ఆరిఫ్, శ్రీనివాసరావు, సంగమేశ్వర్ రావు, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.