11-04-2025 12:00:00 AM
స్టార్ హీరో నాని నుంచి వస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్3: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. మ్యూజిక్ ప్రమోషన్స్ లీడ్ పెయిర్ రొమాంటిక్ సాంగ్ తో ప్రారంభించిన చిత్రబృందం తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్..’ అనే ఈ గీతం కథానాయకుడి పాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తోంది. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం అందించగా, మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యం లో అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాటలోని ‘ఇతడి ఒరవడి యముడికి భయమే..’ వంటి పంక్తులు అర్జున్ సర్కార్ పాత్రలో నాని ఎలా మెప్పించబోతున్నాడో తెలియజేస్తున్నాయి. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.