calender_icon.png 17 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతని వ్యవహారం డేటింగ్‌లోనే తెలిసింది

16-09-2024 04:54:43 AM

చాలా మంది వయసొచ్చిన తర్వాత ప్రేమలో పడడం సాధారణం. అయితే, సెలబ్రిటీల లవ్ జర్నీ పెళ్లి దాకా చేరుతుందా? అనేది ఎవరూ చెప్పలేరు. ప్రేమ, పెళ్లితో జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేవారు కొందరైతే, మరికొందరి పెళ్లి పెటాకులవుతుంది. ఇంకొన్ని ప్రేమలు పెళ్లిపీటలైనా ఎక్కవు. ఇండస్ట్రీలో ఎల్లలు లేని ప్రేమల కన్నా డొల్లతనం కలిగినవే ఎక్కువ. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమ కూడా అటువంటిదేనట! ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పిందీ భగ్న ప్రేమికురాలు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ బ్యూటీ తన ప్రేమాయణాలు, బ్రేకప్స్ గురించి పంచుకుంది.

‘సరైన వ్యక్తి వచ్చేంతవరకు మన జీవితంలోకి వచ్చివెళ్లేవారు చాలా మంది ఉంటారు. మీకు ఎవరు సూట్ అవుతారనేది మీకే తెలుస్తుంది. నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. కానీ, డేటింగ్ సమయంలో అతని వ్యవహారం అలా అనిపించలేదు. అందుకే బ్రేకప్ చెప్పేసుకున్నాం. ఏడు నెలల క్రితమే ఈ బ్రేకప్ జరిగింది.

ఇది మరీ బాధపడిపోయేంతటి విషయమేం కాదు. ఇప్పటివరకు నాకు చాలా బ్రేకప్స్ జరిగాయి. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. నన్ను చేసుకోబోయేవాడికి లుక్స్ లేకపోయినా, మంచి మనిషై ఉంటే చాలు’ అని తెలిపింది. ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘సీతారామం’తో ఎంట్రీ ఇచ్చిందీ భామ. ప్రస్తుతం టాలీవుడ్ ప్రాజెక్టులేవీ ఈ అమ్మడు చేతిలో లేవు.. ఫోకస్ అంతా హిందీపైనే పెట్టింది.