28-02-2025 01:00:46 AM
మణుగూరు ఫిబ్రవరి 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణు గూరు ఏరియాలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లతో వెట్టి చాకిరిని తలపించేలా కూలి పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు సర్వ త్ర వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే గురువారం సింగరేణి సీఎం కార్యాల యం నుంచి మారుమూల అటవీ ప్రాంతమైన బుగ్గ గ్రామానికి వెళ్లే దారిలోని సెక్యూ రిటీ అవుట్ పోస్ట్ వద్ద దార్డులకు సంబంధం లేని పనులు చేయించడంతో వీరబాబు అనే ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తోటి సెక్యూరిటీ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
వీరబాబు కొంత అస్వస్థతకు గురయ్యానని చెప్పినప్పటికీ సెక్యూరిటీ అధికారి కావాలనే బుగ్గ ప్రాంతంలో డ్యూటీ కేటాయించి అవుట్ పోస్ట్ నిర్మాణ పనుల చేయించారని, దీంతో గతంలో తన కడుపుకు చేసిన ఆపరేషన్ సమయంలో వేసిన కుట్లు చిట్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తోటి సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. స్థానిక సింగరేణి సెక్యూరిటీ అధికారి కావాలనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
జయం కార్యాలయం ఎదురుగా ఉన్న పాత జిఎం కార్యాలయంలో సెక్యూరిటీ సిబ్బందితో గడ్డి పీకించడం స్క్రాప్ సదిరిపించడం లాంటి కూలి పనులు చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. కావాలనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్లకు డ్యూటీలు ఇవ్వకుండా లేదా డ్యూటీ ఇచ్చిన ఎక్కడో పనిష్మెంట్గా మారుమూల ప్రాంతాల్లో కేటాయించడం లాంటి పనులకు పాల్పడుతున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సింగరేణి ఓబి డంపింగ్ ప్రాంతాల్లో యాజమాన్యమే వదిలేసుకున్న సింగరేణి స్క్రాప్ ను సైతం సెక్యూరిటీ సిబ్బందితో ప్రత్యేకంగా వెలికి తీయించి వాటిని సిబ్బందితోనే మోపిస్తున్నాడని ఆరోపణలు లేకపోలేదు. ఇటీవల జరిగిన ఓ సంఘటనపై సిబ్బంది తరపున ముందు నిలబడి ప్రశ్నించినందునే సెక్యూరిటీ అధికారి వీరబాబు పై కక్ష సాధించేందుకే అటవీ ప్రాంతంలోని అవుట్ పోస్ట్ వద్ద డ్యూటీ కేటాయించి పనులు చేయించారని ఆరోపణలు చేస్తున్నారు.
విచారణ చేస్తున్నాం : డీజీఎం
మణుగూరు సింగరేణి సెక్యూరిటీ అధికారి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను వేధిం పులకు గురి చేస్తున్నాడు వెట్టి చాకిరి చేయిస్తున్నాడు అన్న ఆరోపణలపై విచారణ చేస్తు న్నామని డీజీఎం పర్సనల్ ఎస్ రమేష్ తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ వీరబాబు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఆస్పత్రికి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. సంఘటనపై డీజీఎం పర్సనల్ ను వివరణ కోరగా ఆయన విజయ క్రాంతితో మాట్లాడారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని, ఇలా వెట్టిచాకిరి పనులు చేస్తే సదరు అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.