calender_icon.png 11 February, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరాసుక జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి

11-02-2025 01:46:15 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఉట్నూర్ లో ఈనెల 14న ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సంఘం(Tribal Purohit Pradhan Sangam) ఆధ్వర్యంలో నిర్వహించే హిరాసుక జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆదివాసీ ప్రధాన్ సంఘ సభ్యులతో కలిసి జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ... ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించిన మహనీయుడు హీరాసుక అని కొనియాడారు. ఎక్స్ రోడ్డు గ్రామంలో జరిగే హీరసుక జయంతి వేడుకలకు ఆదివాసీలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సంఘం అధ్యక్షుడు కనక సంతోష్, అధ్యక్షుడు మడవి దత్తు, ప్రధాన కార్యదర్శి సోయం రాందాస్, సలహాదారుడు గెడం నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.