calender_icon.png 29 September, 2024 | 5:52 PM

హిందువులు గళం విప్పాలి !

29-09-2024 02:17:53 AM

ప్రధాని మోదీ స్పందించి గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలి

గోసంరక్షణ చట్టాలని తీసుకురావాలి 

జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ

అగర్తలాలో గోధ్వజ్ స్పాపన

అగర్తలా, సెప్టెంబర్ 28: పవిత్రమైన గోమాతను కేంద్రం రాష్ట్రమాతగా ప్రకటించే వరకు హిందువులు విశ్రమించవద్దని, అం దుకు ప్రతి హిందువూ గళం విప్పాల్సిన సమయం వచ్చిందని ఉత్తరాఖండ్ జ్యోతిర్మ ఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు.

‘గోమాత.. రాష్ట్ర మాత’ యాత్రలో భాగంగా శనివారం ఉదయం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు చేరుకుని గోధ్వజ స్థాపన చేయాల్సి ఉన్నది. స్వామీజీ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతులు రాక పోవడంతో తిరిగి ఆయన త్రిపుర రాజధాని అగర్తలాకు పయనమయ్యారు. అనంతరం మేఘాలయ గగన తలంలోనే గోధ్వజ స్థాప న చేశారు.

కొద్దిసేపటి తర్వాత స్వామీజీ అగర్తలా చేరుకున్నారు. స్వామీజికీ స్థానిక స్వాగ త కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ అనంతరం అగర్తలాలోని జగన్నాథస్వామి ఆలయంలో గోధ్వజ స్థాపన చేశా రు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడు తూ..  ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా..

ఏ ప్రభుత్వమూ గోవు పవిత్రతను గుర్తించడం లేదని వాపోయారు. కేంద్రం గోవును రాష్ట్రమాతగా ప్రకటించి, స్పష్టమైన ఆదేశాలిస్తేనే దేశంలో గోహత్యలు ఆగుతాయని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి కూడా ఆయన గోవధ గురించి పట్టించుకోకపోవడం తమ ను బాధిస్తుందన్నారు.

కేంద్రం ఇప్పటికైనా స్పందించి గోసంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోవును కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మాతగా ప్రకటించాలన్నా రు. రాముడు, కృష్ణుడు సౌతం గోమాత కోస మే అవతరించారన్నారు.

అంత పవిత్రత గల గోవును జంతువుగా భావించడం పాపమని, గోవును గోమాతగానే చూడాలని పిలుపునిచ్చారు. భారత్‌కు స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి ఎంతోమంది గోవును దైవంగా కొలిచారని కొనియాడారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారన్నారు.