calender_icon.png 28 January, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులు ముగ్గురు పిల్లల్ని కనాలి

27-01-2025 12:13:36 AM

  1. పిలుపునిచ్చిన వీహెచ్‌పీ నేత
  2. బంగ్లాలో హిందువుల పరిస్థితిపై ఆందోళన

ప్రయాగ్‌రాజ్, జనవరి 26: హిందువుల్లో జననాల రేటు పడిపోవడంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రతి ఒక్క హిందూ కుటుంబం తప్పకుండా ముగ్గురు పిల్లలను కనాలని వీహెచ్‌పీ నేత తెలిపారు. మహాకుంభ్ నగర్‌లో నిర్వహించిన విరాట్ సంత్ సమ్మేళన్‌లో వీహెచ్‌పీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ భజరంగ్‌లాల్ భాంగ్రా మాట్లాడుతూ.. ముగ్గురు పిల్లల్ని కనాలన్నారు.

‘హిందువుల్లో తగ్గుతున్న జననాల రేటు దేశంలో హిందూ జనాభా మీద ప్రభావం చూపుతోంది. కాబట్టి దేశంలోని హిందువులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలి. అనేక మంది సాధువులు కూడా ఇదే విషయం తెలిపారు’ అని అన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి కూడా ఆయన మాట్లాడారు.

‘కేవలం బంగ్లాదేశ్‌లోనే కాదు. భారత్‌లో కూడా హిందువుల మీద దాడు లు జరుగుతున్నాయి. ఈ విషయం మీద హిందువులు లోతుగా ఆలోచించాలి. వక్ఫ్ బోర్డు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తోంది.