16-04-2025 12:00:00 AM
* శ్రీ దక్షిణ కాశికాంబ సమేత కమటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
* భక్తులకు ఆలయం వద్ద అన్న ప్రసాదం
* సనాతన ధర్మం విశిష్టతలను భక్తులకు తెలిపిన జగద్గురు శ్రీ శ్రీ కాoతేంద్ర గురు స్వాములు
వనపర్తి:, ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ) : హిందువులు సనాతన ధర్మంతోపాటు ఐక్యమత్యం పాటించాలని.. హిందు ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని జగద్గురు శ్రీ శ్రీ కాoతేంద్ర గురు స్వామి అన్నారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతబజార్ శ్రీ దక్షిణ కాశికాంబ సమేత కమటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ట వేడుకల్లో భాగంగా మంగళవారం వేద పండితుల మంత్రాల మధ్య పూజలు వైభవంగా జరిగాయి.
రోడ్ల విస్తరణలో కాళిమాత ఆలయాన్ని తొలగించడంతో ప్రస్తుతం పునః ప్రతిష్ట మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా చేపడుతున్నారు.ఈ క్రమంలో ఒక్కొక్క క్రతువు యొక్క ప్రాధాన్యతను జగద్గురు శ్రీ శ్రీ కాoతేంద్ర గురు స్వామి భక్తులకు వివరిస్తూ సనాతన ధర్మం యొక్క విశిష్టతలను తెలిపారు.
హిందు ధర్మ పరిరక్షణపై ఆధ్యాత్మిక ప్రవచనలు చేశారు.సనాతన ధర్మాన్ని పాటించాలని... ధర్మం యొక్క విశిష్టత గురించి సమాజానికి,నేటి తరాలకు తెలియజేయలన్నారు.పుట్టిన రోజు వేడుకల్లో దీపాలు ఆర్పీ,కేకు కట్టింగ్ వంటివి చేయకూడదని..వృధా ఖర్చు చేయకుండా సాటి వారికీ సాయం చేసినప్పుడే మన జన్మ సార్ధకం అవుతుందన్నారు.
మొదట ఆలయ ప్రాంగణం వద్ద ఉదయం భక్తులు హోమాలు చేశారు.సుప్రభాత సేవ, సహస్ర నామ పూజలు, విగ్రహ పంచామృత స్నానం, జలదివాసం, క్షిరాదివాసం, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద స్వీకరణ, సాయంత్రం శ్రీ దక్షిణ కాశికాంబ సమేత కమటేశ్వర స్వాముల ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది.కాళీ కాంబ అమ్మవారి నామ స్మరణలతో పూజ కార్యక్రమానికి ప్రవాహంలా తరలి వచ్చిన భక్తులతో పాత బజార్ కాలనీ అంత కాషాయివర్ణంగా మారింది.