calender_icon.png 14 October, 2024 | 5:59 AM

హిందువులు ఐక్యంగా ఉండాలి

14-10-2024 03:17:13 AM

అప్పుడే మనపై జరిగే దాడులను ఎదుర్కోగలం

స్వార్థానికి రాజకీయ పార్టీలు ప్రధాన్యమిస్తున్నాయి

దసరా ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ 

నాగ్‌పూర్, అక్టోబర్ 13: భారత వైవిధ్యత ప్రాముఖ్యాన్ని నొక్కి చెబు తూ సామరస్యంగా ఉండాలని తన దసరా సందర్భంగా నాగ్‌పూర్ వేదికగా చేసిన ప్రసంగంలో ఆర్‌ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు నిచ్చారు.

విభజన శక్తులను హెచ్చరిస్తూ మల్టీ పార్టీ ప్రజాస్వామ్యంలో దేశ గౌరవం, సామరస్యం, సమగ్రత కన్నా స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీకి మద్దతుగా నిలవడం, ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో తమ విధ్వంసకర ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే వారి మార్గమని మండిపడ్డారు. సంస్కృతీ, సంప్రదాయాలకు సామాజిక, రాజకీయ మోసాలు, డీప్ స్టేట్, కల్చరల్ మార్క్సిస్టులు శత్రువులుగా మారాయని ఆరోపించారు.    

ఐక్యంగా ఉంటేనే..

బంగ్లాదేశ్‌లో నిరంకుశ ఛాందసవాద స్వభావం ఉందని చెప్పిన మోహన్ భగవత్ హిందువులతోపాటు మైనారిటీల తలలపై కత్తి వేలా డుతోందన్నారు. దుర్గా పూజ మండపాలపై రాళ్లు వేయడం, హిందువులపై హింసాత్మక దాడులు వంటి ఘటనలను ప్రస్తావిస్తూ హిందువులు ఐక్యం గా ఉండాలని పిలుపునిచ్చారు.

కలిసికట్టుగా ఉండకపోవ డం, బలహీనంగా ఉండటమంటే దురాగతాలను ఆహ్వానించడమేనని చెప్పారు. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య సిగ్గుచేటని, నేరస్థులను రక్షించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. నేరాలు, రాజకీయాలు, విష సంస్కృతి కలగలిసి సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంతోషం వ్యక్తం చేశారు.