calender_icon.png 19 January, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో హిందువులను కాపాడాలి

13-08-2024 12:27:42 PM

హిందువుల రక్షణకు ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక చర్చ జరగాలి 

గజ్వేల్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలంటూ గజ్వేల్ లో మంగళవారం హిందువులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ అంగడిపేట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఇంద్ర పార్క్ చౌరస్తా మీదుగా కోర్టు వరకు భారీ ర్యాలీ కొనసాగింది. హిందూ సంస్థల తో పాటు పలువురు రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా ర్యాలీలో పాల్గొన్నారు.

బంగ్లాదేశ్లో హిందువుల పై దాడులను నిరసిస్తూ గజ్వేల్లో స్వచ్ఛంద బందుకు పిలుపునివ్వగా భారీగా దుకాణ వ్యాపారులు స్పందించి తమ తమ దుకాణాలు వ్యాపారాలను మధ్యాహ్నం వరకు మూసి బందును పాటిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాస శ్రీనివాస్, వేద పండితులు రాజశేఖర్ శర్మ, నంద బాల శర్మ, బిజెపి సీనియర్ రాష్ట్ర నాయకులు ఎల్లు రాంరెడ్డి కౌన్సిలర్లు, హైందవ సంఘాల నాయకులు, హైందవ సోదరులు వాట్స్అప్ సమూహం సభ్యులు పలు ఆలయాల భజన మండలి సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

వారంతా మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని కోరారు. ఐక్యరాజ్యసమితిలో హిందువుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువులకు ఎంతో చరిత్ర ఉందని, ప్రతి దేశంలో హిందువులు వారి సేవలో ఆయా ప్రజలకు అందిస్తున్నారన్నారు. హైందవ సోదరులు వాట్సాప్ సమూహం సభ్యులంతా ర్యాలీ అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ బన్సలాల్ కు హిందువులకు రక్షణపై ఐక్యరాజ్యసమితిలో చర్చించాలని వినతిపత్రం అందజేశారు.