calender_icon.png 6 November, 2024 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో రోడ్డెక్కిన హిందువులు

04-11-2024 01:41:11 AM

  1. తమపై దాడులను అరికట్టాలంటూ ఛటోగ్రామ్‌లో భారీ ర్యాలీ
  2. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

న్యూఢిల్లీ, నవంబర్ 3: బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గాలైన హిందువులు, ఇతర మతాల ప్రజలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని.. వాటిని వెంటనే ఆపేయడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హిందువులు శనివారం ఛటోగ్రామ్ నగరంలోని వీధుల్లోకి వచ్చారు.

దాదాపు 30వేల మంది ర్యాలీలో పాల్గొని యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఛటోగ్రామ్‌తో పాటు బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో హిందువులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం ఇప్పటివరకు 19మంది హిందూ నాయకులపై కేసులు నమోదు చేసింది. వారిలో ఇద్దరిని అరెస్టు చేసింది.

కాగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి అక్కడ అస్థిర వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు హిందువు లతో పాటు బౌద్ధులు, క్రైస్తవులు, సిక్కులు సహా మైనార్టీలందరిపై బంగ్లాదేశ్‌లో మారణహోమం కొనసాగుతోందంటూ అంతర్జా తీయ చానెళ్లలో వార్తలు వెలువడుతూనే ఉన్నాయి.

దాడులను ప్రస్తావించిన మోదీ, ట్రంప్

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా బంగ్లాలో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను ఇటీవల ప్రస్తావించారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తారు.

ఐక్యరాజ్యసమితి సహా అనేక ఏజెన్సీలు మానవ హక్కులను పరిరక్షించడానికి యూనస్ ప్రభుత్వానికి కఠినమైన ఆదేశాలు ఇచ్చాయి. బంగ్లాలో ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఇక్కడ ముస్లిం జనాభా 91 శాతం కాగా, హిందువుల జనాభా 8 శాతంగా ఉంది.