calender_icon.png 11 April, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి పౌర స్మృతితో ఎవరికీ లాభం లేదు

30-04-2024 12:10:00 AM

బీజేపీ మాత్రమే లబ్ధి పొందాలని చూస్తోంది: మమతా బెనర్జీ

న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సోమవారం విమర్శలు చేశారు. హిందువులకు నిరుపయోగమైన ఉమ్మడి పౌరస్మృతిని, ఎన్నికల ముందు రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోం దని మమత ఆరోపించారు. బెంగాల్‌లో ని ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలప్పుడే ఒక అంశాన్ని సమస్యగా  మార్చి సమాజంలో అలజడి రేపాలని బీజేపీ ప్రయత్నిసుంటుందని విమర్శించారు. యూ సీసీని ఉపయోగించుకొంటున్నారు. రెండు ఎన్నికల దశలలో ఓటింగ్ శాతాన్ని చూసిన తర్వాత బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని, మిగతా ఇదే పరిస్థితి ఉంటుందని ఆమె జోస్యం చెప్పారు.