12-04-2025 08:56:06 PM
బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): హిందువులంతా ఐక్యమత్యంగా బలంగా ఉండాలని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం పట్టణ కేంద్రంలో బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు అనుమంతుని యొక్క వానరసేన లాగా ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి బిజెపి పట్టణ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.