calender_icon.png 7 January, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తినివ్వాలి

06-01-2025 12:19:39 AM

  1. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిర్‌జీ మహారాజ్
  2. హైందవ ధర్మం దాడులను ఎదుర్కొన్నది: ఎంపీ పురందేశ్వరి
  3. ఏపీలోని కేసరిపల్లి ‘హైందవ శంఖారావం 
  4. సభకు వేలాదిగా తరలివచ్చిన ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజలు

అమరావతి, జనవరి 5: ఏపీలోని హిం దూ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కల్పించాలని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద దేవ్ గిరిజీ మహారాజ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరిపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘హైందవ శంఖారావ’ సభలో స్వామీజీ మాట్లాడారు.

ముం దుగా నిర్వాహకులు భారతమాత చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు, హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. వారి ని ఉద్దేశిస్తూ స్వామీజీ మాట్లాడుతూ.. ‘మన దీక్ష.. దేవాలయాల రక్ష’ అని నినదించారు.

సనాతన ధర్మ పరిరక్షణే ప్రతి హిందువు ప్ర థమ కర్తవ్యం కావాలని సూచించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఆదర్శంగా తీసు కోవాలని పిలుపునిచ్చారు. హిందువుల ఆలయాలు ప్రార్థనా స్థలాలు కావని, అవి దైవిక సంస్కృతికి ఆవాసాలని పేర్కొన్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లా డుతూ.. ఏపీలో గడిచిన ఐదేళ్లలో హైందవ ధర్మం అనేక దాడులను ఎదుర్కొన్నదని ధ్వ జమెత్తారు.

గత ప్రభుత్వం హిందువుల మ నోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఆ అరాచకాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే ‘హైందవ శంఖారావం’ చేపట్టామని స్పష్టం చేశారు.  రాష్ట్రం లో మత మార్పిడులను అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

ఆ సినిమాలను బహిష్కరించాలి: అనంత్‌శ్రీరామ్

చలన చిత్రాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని, అలాంటి సినిమాలను ప్ర జలు బహిష్కరించాలని సినీ గేయ రచయి త అనంత్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. వాల్మీ కి రామాయణం, వ్యాస భారతం భారత సాహిత్య పరంపరకు రెండు కళ్లు వంటివన్నారు. వాటిపై  సినియాల్లో వక్రీకరణలు రావడం బాధాకరమన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసేలా తీసే చిత్రాలను ప్రజలు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.