calender_icon.png 20 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో హిందూ నేత దారుణ హత్య

20-04-2025 01:03:27 AM

  1. తీవ్రంగా ఖండించిన భారత్
  2. మైనార్టీల రక్షణ బాధ్యత తీసుకోవాలని సూచన
  3. కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: బంగ్లాదేశ్‌లో హిందూ నేత భబేశ్ చంద్రరాయ్ కిడ్నాప్, హత్య ఉదంతాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హిందువులు సహా ఇత ర మైనార్టీల రక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించింది. మైనార్టీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత యూనస్ ప్రభుత్వంపై ఉం దని స్పష్టం చేసింది. ‘హిందూ మైనార్టీ నేత భబేశ్ చంద్రరాయ్ కిడ్నాప్, దారుణ హత్య మా దృష్టికి వచ్చింది. ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా బాధించింది.

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వపాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు ఇది ఇంకో నిదర్శ నం. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడివాళ్లకు ఎలాంటి శిక్ష పడలేదు. వాళ్లు స్వేచ్ఛ గా తిరుగుతున్నారు. ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా లేకుండా మైనార్టీలను రక్షించే బాధ్యత ఈ తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని మరోసారి గుర్తు చేస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వా ల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇంటికొచ్చి ఎత్తుకెళ్లిన దుండగులు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 330 కిలోమీటర్ల దూరంలో గల దినాజ్‌పూర్ జిల్లా, బసుదేబ్‌పూర్ గ్రామంలో భబేశ్ చంద్రరా య్ (58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రాయ్ బుధవారం సాయం త్రం 4.30 గంటలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ఇంటి వద్దే ఉన్నట్టు ఆ ఫోన్ కాల్ ద్వా రా రాయ్ అవతలి వారికి చెప్పారు. తర్వాత కొద్ది నిమిషాలకే నలుగురు దుండగులు మోటర్ సైకిళ్లపై వచ్చి రాయ్‌ను బలవంతంగా తీసుకెళ్లారు.

నరబరి అనే గ్రామానికి తీసుకెళ్లి అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం అపస్మారక స్థితిలో రాయ్ తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. దీం తో కుటుంబ సభ్యులు అతడ్ని స్థానికంగా ఉన్న  ఆసుపత్రికి తరలించారు. అక్కడ వై ద్యులు పరీక్షించి రాయ్ మృతి చెందినట్టు పే ర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభు త్వం కూలిపోయిన తర్వాత అక్కడ మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. 

కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

భబేశ్ చంద్రరాయ్ హత్యపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పంది స్తూ.. ప్రధాని నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ మధ్య ఇటీవల జరిగిన స్నేహపూర్వక సమావేశం విఫలమైందనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. అలాగే పార్లమెంటరీ డేటాను ఉటంకిస్తూ బంగ్లాదేశ్‌లోని హిందువులపై గడిచిన రెండు నెలల్లో 76 దాడులు జరిగాయని, ఇందులో 23 మంది మరణించారని పేర్కొన్నారు. ఖర్గే మాటలను బీజేపీ ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించింది. 

బంగ్లాకు వెళ్లే ముందు ఆలోచించండి

అశాంతి, నేరాలు, ఉగ్రవాదం వంటి కారణాల వల్ల బంగ్లాదేశ్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ ప్రయాణం గురించి మరోసారి ఆలోచించుకోవాలని అమెరికా ప్రభుత్వం ఆ దేశ పౌరులకు సూచించింది. అమెరికా తాజాగా తన ట్రావెల్ అడ్వైజరీని అప్‌డేట్ చేసింది. ఈ అడ్వైజరీలో బంగ్లాదేశ్‌ను లెవల్  3 రీకన్సిడర్ ట్రావెల్ (తిరిగి ఆలోచించుకోండి) జాబితాలో చేర్చింది. అలాగే బంగ్లాలోని ఖగ్రాచారి, రంగమతి, బందర్భన్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ వంటి ప్రాంతాలను లెవల్ డు నాట్ ట్రావెల్ (ప్రయాణించకూడని) జాబితాలో చేర్చింది.