calender_icon.png 8 January, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ సంస్కృతిని కాపాడాలి

06-01-2025 12:26:56 AM

కోరుట్ల, జనవరి 5 ( విజయ క్రాంతి): చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు యు వత దూరంగా ఉండాలని, హిందూ సంస్కృ తిని కాపాడుతూ గో రక్షణ, ధర్మ రక్షణ, దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ర్ట ఉపాధ్యక్షులు డాక్టర్ రాం సింగ్, భజరంగ్ దళ్ రాష్ర్ట కన్వీనర్ శివ రాములు అన్నారు. ఆదివారం జగిత్యాల జి ల్లా కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష, కాషాయ కవాతు నిర్వహించా రు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో దేవాలయాల ఎండోమెంట్ చట్టంను ప్రభుత్వం తొలగించాలని డిమాం డ్ చేశారు. సుమారు 600మంది త్రిశూల్ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రధాన రహ దారుల వెంబడి కాషాయ జెండాలు, త్రిశూలాలు పట్టుకొని భారీ కాషాయ కవా తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, ప్రధా న వక్త ధనుంజయ్, అల్లె మధు, జిల్లా అధ్య క్షుడు పద్మాకర్, జిల్లా కార్యదర్శి గజం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పోహార్ తుకారాం, భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ రోహిత్, కో కన్వీనర్ మనోహర్, చెట్ పల్లి శంకర్, శివ, విజయ్, వెంకటేష్  పాల్గొన్నారు.