రాజేంద్రనగర్, అక్టోబర్27: రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన హిందీ ఉపాధ్యాయురాలు రూపాదేవి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె శివరాంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ‘రాజేంద్ర యాదవ్ కె కథా సాహిత్యా మే చేతనా కే ఆయాం’అనే అంశం పై డాక్టర్ రాజశ్రీ మోరే పర్యవేక్షణలో పరిశోధనలు పూర్తి చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల హిందీ విభాగం నుం చి డాక్టరేట్ అందుకున్నారు.