న్యూఢిల్లీ, ఆగస్టు 2: జింక్‌తో పాటు దేశంలో ఏకైక వెండి ఉత్పత్తి కంపెనీఅయిన హిందుస్థాన్ జింక్ నికరలాభం 2024 ఏప్రిల్ త్రైమాసికంఓ 19.3 శాతం వృద్ధిచెంది రూ. 2,345 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 1,964 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ముగిసిన త్రైమాసికంలో హింద్ జింక్ ఆదాయం రూ. 7,554 కోట్ల నుంచి రూ. 8,398 కోట్లకు పెరిగింది. జింక్ ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీ అయిన హింద్ జింక్ వెండి ఉత్పత్తిలో అంతర్జాతీయంగా మూడోస్థానాన్ని ఆక్రమిస్తున్నది. కంపెనీ దాదాపు 40 దేశాలకు ఎగుమతులు జరుపుతుండగా, భారత్ జింక్ మార్కెట్లో 75 శాతం వాటా ఉన్నది.