calender_icon.png 14 October, 2024 | 8:13 AM

హింద్ జింక్ డివిడెండు రూ.8,028 కోట్లు షేరుకు రూ.19 చొప్పున చెల్లింపు

21-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 20: వేదాంత గ్రూప్ కంపెనీ హిందుస్థాన్ జింక్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.18 చొప్పున మొత్తం రూ.8,028 కోట్ల మధ్యంతర డివిడెండు చెల్లించేందుకు మంగళవారం ఆమోదం తెలిపింది. 2023 24 ఆర్థిక సంవత్సరంలో హింద్ జింక్ రూ. 5,493 కోట్ల డివిడెండును చెల్లించగా, ఆ కంపెనీలో 29.5 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,622 కోట్లు లభించింది. అంతక్రితం 2022 రికార్డుస్థాయిలో రూ. 32,000 కోట్ల డివిడెండును ప్రకటించగా, కేంద్రానికి రూ. 9,500 కోట్లు అందాయి. ఈ జూన్ త్రైమాసికంలో హింద్ జింక్ నికరలాభం 19 శాతం వృద్ధితో రూ. 2,345 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 8,398 కోట్లకు పెరిగింది. ప్రపంచంలో జింక్ ఉత్పత్తిలో ద్వితీయస్థానంలోనూ, వెండి ఉత్పత్తిలో తృతీయస్థానంలోనూ హిందు స్థాన్ జింక్ నిలిచింది.