calender_icon.png 1 January, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీనా.. నువ్వో రాక్‌స్టాక్!

08-07-2024 12:00:00 AM

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనా ఖాన్ ఒకరు. ఆమె క్యాన్సర్ బారిన పడినట్లు తెలుపుతూ ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. తాజాగా తన తొలి కీమోథెరపీ సెషన్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. జీవితం విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు పాజిటివిటీనే అస్త్రంగా చేసుకున్నట్లు వెల్లడించిన ఈ ముద్దుగుమ్మ ధైర్యానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రస్తుతం హీనా ఖాన్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నది. 

ఇటీవల హీనా ఖాన్ తన హెయిర్‌ను కట్ చేయించుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో ఏడుస్తున్న తన తల్లిని ఆమె ఓదార్చారు. ‘క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు జుట్టును కోల్పోవడం ఎంతో కఠినమైనది. కానీ గెలిచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నా అందమైన జుట్టు రాలిపోకముందే తొలగించాలని నిర్ణయించుకున్నా. ఆ మానసిక క్షోభను నేను భరించాలనుకోలేదు’ అంటూ తన మాటలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నది బాలీవుడ్ బ్యూటీ.  

నా జీవితానికి ఓ సవాలు..

నా తొలి కీమో సెషన్‌కు ముందు నేను అందుకున్న ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. నేను ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నానన్న భరోసానూ నాకు అందించింది. ఓ కేటగిరీలో అవార్డు అందుకున్న హీనా.. ఈవెంట్ ముగియగానే నేరుగా తొలి కీమో సెషన్ కోసం ఆస్పత్రికి వెళ్లారు. ‘ఇది నాకు సవాలుతో కూడిన సమయం. అయినా మానసికంగా దృఢంగా ఉన్నా. ఎలాగైనా ఈ వ్యాధి నుంచి బయటపడాలన్న పట్టుదలతో ఉన్నా. ఇప్పటికే  నాకు చికిత్స మొదలైంది. ఈ వ్యాధితో పోరాడేందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధం! అయితే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే.. ఈ కష్ట సమయంలో మీ వ్యక్తిగత అనుభవాలు, సలహాలు, మద్దతును అందించండి.. అప్పుడే ఒంటరిని కాదన్న భావన నాకు కలుగుతుంది” అని పేర్కొన్నారు. అయితే దీన్ని నేను సవాలుగా కంటే నన్ను నేను కొత్తగా నిరూపించుకునేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నా. పాజిటివిటీతోనే ఈ సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా. కీమోథెరపీ, దీని తాలూకు అనుభవాల్నీ అత్యంత సాధారణంగా చూసేలా చేయాలనుకుంటున్నా.. అలాగే నేను కోరుకున్న ఫలితాన్నీ చేరుకోగలననే నమ్మకం నాకుంది. నా దృష్టిలో నా కెరీర్‌కు ఎంత ప్రాధాన్యమిస్తానో, వ్యక్తిగత జీవితాన్నీ అంతే ఇష్టపడతా. అంతేకానీ ఎక్కడా రాజీ పడను.. వెనక్కి తగ్గను. క్యాన్సర్ విషయంలోనూ అంతే! 

బ్రెస్ట్ క్యాన్సర్ మూడో స్టేజీతో పోరాడుతున్న టీవీ నటి హీనా ఖాన్ ఇటీవలే కీమోథెరపీ సెషన్‌కు ముందు జుట్టు కత్తిరించుకునే వీడియోను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఆ వీడియో అభిమానులకే కాదు ప్రముఖలకు కూడా కంట తడిపెట్టించే విధంగా ఉంది. హీనా ఖాన్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ కొందరు ప్రముఖలు కామెట్స్ చేశారు. ఈ క్లిష్టమైన దశని కూడా హీనా ధైర్యంగా, సానుకూలంగా దృక్పథంతో ఎదుర్కొంటోన్న తీరు ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అటు సెలబ్రిటీలతో పాటు ఇటు సామాన్యులూ స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘రాక్‌స్టార్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

* నీ కోసం నేను ప్రార్థిస్తాను.. ధైర్యంగా ఉండు.  

 సమంత 

* నువ్వు ఎందరికో స్ఫూర్తిదాయం హీనా. నిన్ను చూస్తున్నప్పుడు నా కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. నీ శక్తి, ధైర్యాన్ని చూసి నా హృదయం గర్వంతో నిండిపోయింది. టన్నుల కొద్దీ ప్రేమతో.

జూహీ పర్మార్

* హీనా నువ్వు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం. నువ్వు దీన్ని జయిస్తావు.. 

 శిల్పా శెట్టి

* నీ కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. అంత మంచే జరుగుతుంది. నువ్వు పాజిటివ్‌గా ఉండు. నువ్వు దీన్ని అధిగమిస్తావు, 

 శ్రేయా ఘోషల్