చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న తర్వాత గాయకుడు, నటుడు హిమేశ్ రేష్మియా ‘బాదాస్ రవికుమార్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. 80ల నాటి కథతో ‘బాదాస్ రవికుమార్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. కృతి కుల్హరి కథానాయికగా నటిస్తుండగా.. ప్రభుదేవా విలన్ పాత్రను పోషిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రం నుంచి శుక్రవారం ‘బాజారీ ఇష్క్’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను హిమేశ్ రేష్మియా, శ్రేయా ఘోషల్ ఆలపించారు. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించారు. హిమేశ్ రేష్మియా, సన్నీలియోన్ ఈ పాటలో మెప్పించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.