- భారీ వర్షాల కారణంగా 150 మంది మృతి
- మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
- ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతవారణ శాఖ
సిమ్లా, ఆగస్టు 31: ఈ ఏడు రుతుపవనాలు మొదలైన జూన్ 27 నుంచి హిమాచల్‌ప్రదేశ్ వర్షాల కారణంగా దాదాపు 150 మంది మరణించారు. అంతేకాకుండా రూ.1,265 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వరకు రహదారులు ధ్వంసమైనట్లు వెల్లడించారు. మండీ (12), కాంగ్రా (10), కుల్లు (9), సిమ్లా (5) నగరాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లోనే రాకపోకలు అధికంగా ఉంటాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 5 విద్యుత్తు, 19 నీటి సరఫరా పథకాలను మూసివేయాల్సి వచ్చింది. దీంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సెప్టెంబర్ 2 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని, వరదలు వచ్చే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. సిమ్లా, మండీ, సిర్మౌర్‌లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.