calender_icon.png 3 April, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ విజయంతో.. మొక్కు చెల్లించిన ఖమ్మం పిఆర్టియు నాయకులు

01-04-2025 07:52:48 PM

ఖమ్మం నుండి వైరాకు పాదయాత్ర..

వైరా (విజయక్రాంతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగళి శ్రీపాల్ రెడ్డి ఘనవిజయం సాధించిన సందర్భంగా ఖమ్మం ఇందిరానగర్ వినాయకుని ఆలయం నుండి వైరా పాత శివాలయం వరకు జిల్లా అధ్యక్షులు వైవి ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. పిఆర్టియు వైరా మండల శాఖ అధ్యక్షులు వెలిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో వైరా పరుచూరి గార్డెన్ వద్దకు వచ్చిన ఖమ్మం జిల్లా నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కేతముక్కల సురేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పింగళి శ్రీపాల్ రెడ్డి పేరు మీద స్వామివారికి అభిషేకం చేయించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. 

నంతరం ఆలయ ప్రధాన అర్చకులు పిఆర్టియు కుటుంబ సభ్యులందరికీ వేద ఆశీర్వచనం ఇచ్చి అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు వైవి మాట్లాడుతూ... చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా ఖమ్మం నుండి 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకోవటం ఆనందంగా ఉందని, పిఆర్టియు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి రాబోయే ఆరు సంవత్సరాల్లో ఉపాధ్యాయులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. అనంతరం వైరా ప్రాజెక్టు అలుగుల వద్ద ఉన్న దాసాంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు  నిర్వహించారు. 

ఆలయ చైర్మన్ చావా శ్రీనివాసరావు అందరికీ సాదర స్వాగతం పలికి ఆలయ విశిష్టతను తెలియజేశారు. వైరా మండల శాఖ అధ్యక్షులు వెలిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ 40 మంది పిఆర్టియు కుటుంబ సభ్యులు జిల్లా అధ్యక్షులు వైవి  ఆధ్వర్యంలో వైరా శివాలయానికి రావటం అనేది చారిత్రాత్మక విషయమని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి  నిత్యం అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయ సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తారని తెలియజేశారు. 

వైరా మండల శాఖ అధ్యక్షులు వెలిశెట్టి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి వేమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పిఆర్టియు సీనియర్ బాధ్యులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్ జాన్, జిల్లా ఉపాధ్యక్షులు పాటి రామచంద్రయ్య, అన్నా బత్తుల రమేష్, ముదిగొండ హరిబాబు, నున్నా శ్రీనివాసరావు, పిఆర్టియు మహిళ బాధ్యులు సరిత, రూప, సునీత, పి ఆర్ టి యు శ్రేయోభిలాషులు వూరుకొండ శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీనివాసరావు గోపిశెట్టి నరసింహారావు, వెలిశెట్టి రవికుమార్ ముట్టుకుల రాజేశ్వరరావు, చెడే సుధాకర్, మహిళలు గోపిశెట్టి కృష్ణకుమారి, వెలిశెట్టి అపర్ణ, వెలిశెట్టి శారద, రామిశెట్టి కృష్ణవేణి, కాల్వ అంజలి, గోపిశెట్టి అమృత తో పాటు పిఆర్ టి యు జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు వైవి, పిఆర్టియు రాష్ట్ర బాధ్యులు పుట్లూరు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు విజయ అమృత కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు లింగం సతీష్, రాష్ట్ర బాధ్యులు వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు రత్నకుమార్, కల్లూరు మండల అధ్యక్షులు పాకాల రమేష్, ఏనుకూరు మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వరరావు, ముదిగొండ మండలం అధ్యక్షులు సాంబశివరావు తల్లాడ బాధ్యులు కమలాకర్ రెడ్డి, బోబోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.