కామారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రం లోని హనుమాన్ మందిరం నుండి బాసర వరకు 10వ సారి పాదయాత్ర నిర్వహిస్తు న్నట్లు సుధాకర్ యాదవ్ తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు జన్మదినం వసంత పంచమి సందర్భంగా సుధాకర్ యాదవ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక హనుమాన్ మందిరం నుండి బాసరకు పాదయాత్ర ప్రారంబించారు.
స్థానిక హనుమాన్ మందిరం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 95 మంది భక్తులు బాసరకు పాదయాత్రగా బయలు దేరారు. ఈ కార్యక్రమానికి నాయకులు అవారి గంగారం జండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం బాసరలో అమ్మవారిని దర్శనం చేసుకొనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో లింగం గురుస్వామి, గుడికొండ బాలకృష్ణ, డాక్టర్ బాలకృష్ణ, శశికాంత్, కొర్రి శివకుమార్ యాదవ్, చీదరి రాజు, మల్దొడ్డి విట్టల్, మల్లయ్యగారి ఆకాష్ కుమార్, కందకుర్తి సంతోష్ గుప్తా, ఇన్గు రాములు, కర్క సిద్దు, నారం శ్రీనివాస్, లాడేగామ్ సాయికృష్ణ తదితరులున్నారు.