calender_icon.png 23 December, 2024 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరుకు రోడ్లతో ఇబ్బందులు.. నిత్యం ప్రయాణలకు అవస్థలు

16-09-2024 08:27:30 PM

మునగాల,(విజయక్రాంతి): మునగాల మండలంలో హైవే రోడ్డు వెంట బరకత్ గూడెం నుండి రాయిని గూడెం మీదుగా మిర్యాలగూడ వెళ్లే మార్గం. మునగాల మండలం, చిలుకూరు మండలంలోని గ్రామాలు, గరిడేపల్లి మండలంలోని గ్రామాలు ఈ మూడు మండలాల గ్రామాలు కలుపుతూ వెళ్లే రోడ్డు ప్రజల నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎన్ హెచ్ 65 ఆనుకొని ఉన్న ఈ రోడ్డు ప్రజలు అనేక వాహనాల మీద ప్రయాణం చేస్తూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బరాకాతుగూడెం నుండి ఊరి బయట వరకు ఈ రోడ్డు చాలా ఇరుకుగాను ప్రమాదకరంగానూ ఉన్నది. ఎదురుగా వాహనాలు వస్తే దాటుకొని వెళ్లలేని పరిస్థితి ఉన్నది. ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు వెనుకకు వెళ్లాలి. అదే సమయంలో చిన్న చిన్న వాహనాలు వస్తే ఎటు తొలగలేని పరిస్థితి ఉన్నది. వ్యవసాయ పనులప్పుడు,ధాన్యం చేతికొచ్చినప్పుడు ఆ రైతుల బాధ వర్ణనాతీతం. ట్రాఫిక్ జామ్ అయితే ఒక అర్థగంటో,గంటలోనూ క్లియర్ చేసుకొని వెళ్తారు. కానీ రైతులు దాన్యం లోడ్ వేసుకొని వెళ్లే పరిస్థితిలో కనీసం కొద్ది రోడ్డు దాటి వెళ్ళడానికి సుమారుగా మూడు గంటల పైగా సమయం పడుతుంది. ఈ రోడ్డుపైన నిత్యం బైకులు,ఆటోలు, రైతుల యొక్క ట్రాక్టర్లు భారీ వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఆ రోడ్ల వెంట ఇండ్లు  ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడేయాలని, ఈ రోడ్డుని వెడల్పు చేసి ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలని మూడు మండలాల ప్రజలు కోరుతున్నారు.