calender_icon.png 1 October, 2024 | 7:07 AM

హైవే.. స్లో వే !

01-10-2024 02:33:39 AM

అతీగతి లేని అప్పా జంక్షన్- మన్నెగూడ రోడ్డు విస్తరణ

శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయినా కనిపించని పురోగతి

సీఎం, స్పీకర్ సొంత జిల్లాలో పనుల్లో తీవ్ర జాప్యం

ఇరుకు హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు

సర్కార్ స్పందించాలని ప్రయాణికుల వేడుకోలు

వికారాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాం తి): వికారాబాద్ జిల్లాలోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ ఎన్‌హెచ్ 163 జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతాయా..? లేదా? అనే అనుమానం ప్రస్తుతం ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతున్నది.

భూసేకర ణ, చెట్ల తొలగింపుపై కోర్టు కేసులు వంటివి పనులు చేపట్టేందుకు అడ్డంకిగా మారాయి. ఆది నుంచి ఈ పనులకు అవాంతరాలు ఎదురు కావడమే అందుకు కారణం. అసెం బ్లీ ఎన్నికల తర్వాత పనులు ఊపందుకుంటాయని ప్రచారం జరిగినప్పటికీ, ఎన్నికలు ముగిసి కూడా పది నెలలు దాటుతోంది.

46 కి.మీ మేర రూ.928.14 కోట్ల వ్యయం తో నేషనల్ హైవే అథారిటీ రహదారిని విస్తరించాలని నిర్ణయించింది. విస్తరణలో భాగం గా మొత్తం 18 బ్రిడ్జీలు, మొయినాబాద్ వద్ద 4.35 కి.మీ, చేవెళ్ల వద్ద 6.36 కి.మీ మేన బైపాస్ రోడ్డు నిర్మించాల్సి ఉన్నది. మొయినాబాద్ వద్ద 100 మీటర్ల మేర అండర్‌పాస్ రావాల్సి ఉన్నది.

రోడ్డు విస్తరణకు 145.42 హెకార్ల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 350 ఎకరాల భూసేకరణ పూర్త యింది. నిర్వాసితులకు పరిహారం సైతం అందింది.  హైవే అథారిటీ అప్పటికే హజీజ్‌నగర్, చేవెళ్ల వంటి పట్టణాల్లో మార్కింగ్ సైతం పూర్తి చేసింది.

ఎంతోమంది భవనా లు, దుకణా సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా కట్టడాలను కూల్చేసుకున్నా రు. 2022 ఏప్రిల్ 29న కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సకాలంలో పనులు ప్రారంభమై ఉంటే కనీసం 65శాతం పనులు పూర్తయ్వేవి. కానీ, ఇప్పటివరకు పూచిక పుల్లునా కదలలేదు. 

తరచూ ప్రమాదాలు..

నేషనల్ హైవే పలుచోట్ల ఇరుకుగా ఉండడంతో పాటు ఎక్కువ చోట్ల మూల మలుపు లు ఉన్న కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి వికారాబాద్, పరిగి, కోస్గి, కొడంగల్, తాండూరు, గుల్బర్గ, కంది నుంచి శంకర్‌పల్లి, చేవెళ్ల మీదుగా, షాద్‌నగర్ నుంచి చేవెళ్ల మీదుగా పరిగి వెళ్లాలంటే మన్నెగూడ జంక్షన్ దాటా ల్సి ఉంటుంది.

ముఖ్యంగా తాండూరు నుంచి సిమెంట్ లారీలు, నాపరాతి లారీలు, సుద్ద లారీలు, ఎర్రమట్టి తరలించే లారీలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అలాగే శని, ఆదివారాల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి వికారాబాద్ సమీపంలోని అనంతగిరి ప్రాంతానికి వందలాది మంది వస్తుంటారు. హైవే విస్తరణ చేయకపోవడంతో ఈ రెండు రోజుల్లో ట్రాఫిక్ సమస్య లు తలెత్తుతున్నాయి.

క్లియరైన కోర్టు కేసులు..

రోడ్డు విస్తరణకు ప్రతిపాదించిన హైవే వెంబడి ఇరువైపులా మర్రితో పాటు ఇతర వృక్షాలు ఉన్నాయి. రోడ్డు విస్తరించాల్సి వస్తే వాటన్నింటినీ తొలగించాల్సి వస్తుంది. తొలగించిన చెట్లకు బదులుగా మరో ప్రాంతంలో తిరిగి చెట్లు ప్లాంట్ చేయాలని కోర్టు ఆదేశా లు ఇచ్చింది.

అందుకు అవసరమైన  చర్య లు తీసుకుంటామని అధికారులు సైతం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. విస్తరణ పనులను గత ప్రభుత్వ హయాంలో మేఘా ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ దక్కించుకున్నది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో సర్కార్ అదే సంస్థతో పనులు చేపడుతుందా? లేదా అనే సంశయం స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నది.

సీఎం నుంచి స్పీకర్ వరకు..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నియోజకవర్గం వికారాబాద్ అని అందరికీ తెలిసిందే. వీరు సొంత నియోజకవర్గాలకు రావాలన్నా, వెళ్లాలన్నా ఇదే మార్గం నుంచి ప్రయా ణం సాగించాల్సి ఉంటుంది.

జిల్లా నుంచి సీఎం, స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తున్నా హైవే గురించి పట్టించుకోకపో వడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఎంపీ కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డి ఎన్నికల ముందు హైవే గురించి మాట్లాడి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.