calender_icon.png 16 November, 2024 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

T20I చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లు

16-11-2024 10:51:09 AM

క్రీడల్లో అందరికీ ఇష్టమైన గేమ్ ఏదైనా ఉందంటే అది  క్రికెట్. అందరి జీవితాల్లో ఖచ్చితంగా క్రికెట్ టచ్ ఉంటుంది. అది గల్లీ క్రికెట్. ఇక క్రికెట్ విషయానికి వస్తే టెస్టు మ్యాచ్, వన్డే మ్యాచ్, టీ 20 మ్యాచ్, ఐపీఎల్ పేరిట మ్యాచులు నిర్వహిస్తుంటారు. ఇందులో అందరికి బాగా నచ్చే  టీ20 మ్యాచులే.  T20 క్రికెట్‌లో వేగవంతమైన యాక్షన్‌కు పేరుగాంచిన, బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగిస్తారు. టీ20లో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితమైన సిక్సర్‌లు, బౌండరీలతో ఉంటాయి.

అక్టోబర్ 23 వరకు, 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా మంగోలియాపై 314 పరుగులతో నేపాల్ టీ20 చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు సాధించిన రికార్డును నమోదు చేసింది. అయితే, నేపాల్‌తో జరిగిన టి20 ప్రపంచకప్ సబ్-రీజినల్ క్వాలిఫైయింగ్ గేమ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్లకు 344 పరుగులు చేసింది. T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఏ జట్టు అయినా 300 పరుగులను అధిగమించడం ఇది రెండోసారి. జింబాబ్వే, నేపాల్ తర్వాతి స్థానాల్లో భారత్,  ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా ఆకట్టుకునే స్కోర్లు చేశారు.

టీ20ల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు

బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి T20I మ్యాచ్‌లో, భారత్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో దాదాపు 300 పరుగుల మార్కును దాటింది. భారత టాప్ ఆర్డర్ సంజూ శాంసన్ బౌండరీలు, సిక్సర్ల ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాడు. శాంసన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. T20I లలో వేగంగా ఈ మైలురాయిని సాధించిన రెండవ భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

టీ20 చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లు

T20 ఇంటర్నేషనల్స్‌లో టాప్ 10 అత్యధిక జట్లు 

1 జింబాబ్వే 344/4 నేపాల్ అక్టోబర్ 23, 2024

2 నేపాల్ 314/3 మంగోలియా సెప్టెంబర్ 27, 2023

3 భారత్ 297/6 బంగ్లాదేశ్ అక్టోబర్ 12, 2024

4 భారత్ 283/1 దక్షిణాఫ్రికా నవంబర్ 15, 2024

5 ఆఫ్ఘనిస్తాన్ 278/3 ఐర్లాండ్ ఫిబ్రవరి 23, 2019

6 చెక్యా 278/4 టర్కియే ఆగస్టు 30, 2019

7 మలేషియా 268/4 థాయిలాండ్ అక్టోబర్ 02, 2023

8 ఇంగ్లాండ్ 267/3 వెస్టిండీస్ డిసెంబర్ 19, 2023

9 ఆస్ట్రేలియా 263/3 శ్రీలంక సెప్టెంబర్ 06, 2016

10 భారత్ 260/5 శ్రీలంక డిసెంబర్ 22, 2017

10 శ్రీలంక 260/6 కెన్యా సెప్టెంబర్ 14, 2007