calender_icon.png 21 December, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదితాకు అత్యధిక ధర

16-10-2024 12:32:09 AM

హాకీ ఇండియా లీగ్ వేలం

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు డిఫెండర్ ఉదితా దుహాన్ హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో అదరగొట్టింది.. మంగళవారం నిర్వహించిన వేలంలో ఉదితాను బెంగాల్ టైగర్స్ రూ. 32 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో తొలి హాఫ్ ముగిసేసరికి అత్యధిక ధర పలికిన క్రీడాకారిణిగా ఉదితా నిలిచింది.

నెదర్లాండ్స్ స్టార్ డ్రాగ్ ఫ్లికర్ యిబ్బి జాన్సెన్‌ను రూ.29 లక్షలకు ఒడిశా వారియర్స్ సొంతం చేసుకోగా.. భారత ఫార్వార్డ్ ప్లేయర్ సునెలితా టొప్పొను ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ రూ. 24 లక్షలకు కొనుగోలు చేసింది. మిగిలిన వారిలో భారత హాకీ జట్టు కెప్టెన్ సలీమా టిటెపై ఒడిశా వారియర్స్ రూ. 20 లక్షలు వెచ్చించింది.

సీనియర్ వందనా కటారియాను బెంగాల్ టైగర్స్ రూ. 10.5 లక్షలకు, మాజీ కెప్టెన్ సవితాను రూ. 20 లక్షలకు సూర్మా హాకీ క్లబ్ సొంతం చేసుకుంది. హాకీ ఇండియా లీగ్ 2024-25 సీజన్ డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు జరగనుంది.