19-09-2024 01:01:37 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో సూక్ష్మ పరిశ్రమల ద్వారానే అత్యధిక మంది ఉపాధి పొందుతున్నట్టు ఎంఎస్‌ఎంఈ పాలసీ వెల్లడించింది. రాష్ట్రంలో 58,98,593 మంది కేవలం సూక్ష్మ పరిశ్రమల ద్వారానే ఉపాధి పొందుతున్నట్టు స్పష్టంచేసింది. అయితే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మొత్తం 66,84,492 మంది ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నది. అంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కేవలం 7.85 లక్షల మందే ఉపాధి పొందుతున్నట్టు తేలింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య.. సూక్ష్మ పరిశ్రమలలో ఉపాధి పొందుతున్నవారి సంఖ్యతో పోల్చితే 11.75 శాతమే కావడం గమనార్హం.
సేవా రంగంలోనే అత్యధికం
సేవా రంగంలోని సూక్ష్మ పరిశ్రమల్లోనే అత్యధికంగా 29,34,242 మంది ఉపాధి పొందుతున్నారు. ఆ తరువాత స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం, మినరల్, కర్ర ఆధారిత పరిశ్రమలు 4,08,110 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలను పరిశీలిస్తే సేవా రంగంలో అత్యధిక మంది 2,39,793 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇంజినీరింగ్ అండ్ కాపిటల్ గూడ్స్ సెక్టార్‌లో 67,558 మంది ఉపాధి పొందుతున్నారు. మధ్యతరహా పరిశ్రమల్లో పరి శీలిస్తే.. సేవా రంగంలో 93,330 మంది ఉపాధి పొందుతుండగా, రెండో స్థానంలో ఇంజినీరింగ్ అండ్ కాపిటల్ గూడ్స్ విభాగంలోని పరిశ్రమలు 37,763 మందికి పని కల్పిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈ పాలసీలో పొందుపర్చిన ఆయా రంగాలు, అందులో ఉపాధి పొందుతున్నవారి వివరాలు.
అంశం సూక్ష్మ చిన్న మధ్యతరహా మొత్తం
సేవలు 29,34,242 2,39,793 93,330 32,67,365
ఫుడ్ ప్రాసెసింగ్ 9,23,611 62,271 24,211 10,10,093
మినరల్,
కలప ఆధారిత పరిశ్రమలు 4,08,110 26,837 9,379 4,44,326
ఇంజినీరింగ్, కాపిటల్ గూడ్స్ 3,67,952 67,558 37,763 4,73,273
ఎఫ్‌ఎంసీజీ, దేశీయ ఉపకరణాలు 3,60,892 33,411 14,489 4,08,792
టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ 2,76,601 10,860 9,348 2,96,809
ఆటో, విడి భాగాలు 2,46,534 8,292 9,427 2,64,253
హెల్త్, లైఫ్ సైన్సెస్ 1,42,209 38,605 34,385 2,15,199
ప్లాస్టిక్, పాలిమర్స్ 82,314 21,958 14,077 1,18,349
ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్ 72,574 7,172 8,122 87,868
జెమ్స్, జువెల్లరీ 59,750 8,984 3,398 72,132
వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్
గ్రీన్ టెక్నాలజీ 23,804 1,631 598 26,033
మొత్తం 58,98,593 5,27,372 2,58,527 66,84,492
2020-23 మధ్య రాష్ట్రాల వారీగా
మూతపడిన ఎంఎస్‌ఎంఈలు
రాష్ట్రం మూతపడిన
యూనిట్ల సంఖ్య
తెలంగాణ 231
గుజరాత్ 1,626
హర్యానా 558
కర్ణాటక 804
మహారాష్ట్ర 5,082
తమిళనాడు 2,456
ఎంఎస్‌ఎంఈల
యాజమాన్యంలో సామాజిక స్థితి...
రాష్ట్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్
తెలంగాణ 14.94 8.75 27.69 48.62
ఎంఎస్‌ఎంఈలలో
మహిళా పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యం..
రాష్ట్రం తెలంగాణ
మహిళా పారిశ్రామికవేత్తలు
58,644
స్త్రీ జనాభా 1,88,42,000
శాతం 0.31