హైదరాబాద్,(విజయక్రాంతి): వీసీల నియామకంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలపై ఉన్నత విద్యామండలి స్పందించింది. యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి(Higher Education Council Chairman Balakista Reddy) పేర్కొంది. యూజీసీ గైడ్‌లైన్స్(UGC Guidelines) వల్ల వీసీల నియామకం కేంద్రం చేతిలోకి వెళ్తుందని, వీసీలుగా బ్యూరోక్రాట్స్ పై నియమించాలనుకోవటం సరికాదని బాలకిష్టారెడ్డి వెల్లడించారు. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రైవేటైజేషన్ ను ప్రోత్సహిస్తుందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. రాష్ట్ర యూనివర్శిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు. యూనివర్సిటీలు స్వతంత్రంగా ఉండాలి. యూజీసీ గైడ్‌లైన్స్‌పై తాము ఒక కమిటీ వేసుకున్నామని ఆయన తెలిపారు. కమిటీ ఇచ్చే రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.