21-03-2025 08:57:25 PM
ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం
బాసర,(విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని ఆయన గుణగణాలు మన నిజ జీవితంలో సహకరితం చేసుకున్నప్పుడే ఆయన ఆశయాలను కొనసాగించిన వాళ్ళం అవుతామని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం(Higher Education Council Vice Chairman Itikyala Purushottam) అన్నారు. శుక్రవారం రోజున ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ అవిశ్రాంత కృషికి సామాజిక న్యాయం సమానత్వం గుర్తింపుగా స్టూడెంట్ యాక్టివిటీస్ సెంటర్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్(RGUKT Vice Chancellor Professor Govardhan) పలు ప్రముఖుల సమక్షంలో పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ... విద్యార్థి కేంద్రీకృత చొరవలను ప్రాముఖ్యతను వివరిస్తూ సమగ్ర విద్య అనుభవాన్ని అందించడంలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు ముందుంటారని విశ్వవిద్యాలయంలో చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఒక మహోన్నతమైన వ్యక్తిని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ మురళీ దర్శన్, ఏవో రణధీర్ సాగి పలువురు పాల్గొన్నారు.