calender_icon.png 6 November, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుపు నివారణతో అధిక దిగుబడి

06-11-2024 01:01:08 AM

వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామ్‌ప్రకాశ్

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): సాగులో కలుపు యాజ మాన్యం చాలా అవసరమని వ్యవసా య శాస్త్రవేత్త డా. టీ రామ్‌ప్రకాశ్ తెలిపారు. సరైన సమయంలో కలుపు ని వారించకపోతే పంట దిగుబడిపై ప్ర భావితం చూపే అవకాశముందన్నా రు. కలుపు నివారణకు  రసాయన మందులను సరైన మోతాదులో వా డాలని సూచించారు.

మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ  సంచాలకులు బి.గోపి మాట్లాడుతూ  రైతులు ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమానికి హాజరై సాగులో మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. 

కార్యక్రమం లో  అదనపు వ్యవసాయ  సంచాలకు లు విజయకుమార్, జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ  సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నఅభ్యుదయ రైతు వేణుగోపాల్‌రెడ్డి(రాజన్న సిరిసిల్ల), ఎం.శ్యామ్‌సుందర్‌రెడ్డి(మంచిర్యాల).. రాష్ర్టంలోని  తోటి రైతులతో తమ అనుభవాలను పంచుకున్నారు