calender_icon.png 12 March, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియ ఎరువుతోనే అధిక పంట

12-03-2025 12:00:00 AM

మానుకోట జిల్లా మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గొట్టం నవీన్

మహబూబాబాద్,  మార్చి 11 (విజయ క్రాంతి ):సేంద్రీయ ఎరువులతో రైతులు అధిక దిగుబడులు పొందాలని మానుకోట జిల్లా మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గొట్టం నవీన్ తెలిపారు. గూడూరు మండలం సీతానగరం గ్రామంలో షణ్ముఖ ఆగ్రోస్ ఏఎస్‌ఎం అశోక్ రెడ్డి,ఎస్‌ఓ బిక్కు ఆధ్వర్యంలో రైతు సోదరులకు సేంద్రియ ఎదుగులపై అవగాహన సదస్సునిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా గొట్టం నవీన్ హాజరై మాట్లాడుతూ షణ్ముఖ అగ్రోస్  చాలా గొప్ప సంస్థ,రైతు సోదరులకు గత 14 సంవత్సరాలుగా నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ అధిక దిగుబడులు సాధించే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పంట సాగులో రసాయనిక ఎరువు లు అధికంగా వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయని పేర్కొన్నారు.

రసాయన ఎరువులు వాడడం వల్ల క్రమం క్రమంగా భూమిలో భూసారం తగ్గిపోతున్నదని, పంట దిగుబడి కూడా తగ్గిపో తున్నదని,సేంద్రీయ ఎరువులతో పెట్టుబడులు తగ్గించుకోవచ్చునని అ న్నారు. కావాల్సిన పోషకాలను అందితే మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.