calender_icon.png 11 January, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లపై తెగిపడ్డ హైటెన్షన్ కరెంట్ తీగ

03-11-2024 04:20:44 AM

శ్రీనగర్ కాలనీలో తప్పిన పెను ప్రమాదం

సబ్ స్టేషన్ ఎదుట కాలనీవాసుల ఆందోళన

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): నగరంలోని సోమాజిగూడ శ్రీనగర్ కాలనీ వడ్డెర బస్తీలో హైటెన్షన్ కరెంట్ తీగ  శనివారం అకస్మాత్తుగా తెగి ఇండ్లపై పడిపోయింది. అయితే ఆ సమయంలో కరెంటు సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 7.40 గంటల సమయంలో అకస్మాత్తుగా హైటెన్షన్ వైరు తెగిపడింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు రావడానికి జంకారు. అనంతరం కాలనీ వాసుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు హైటెన్షన్ వైరును పరిశీలించి కరెంటు లేదని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వడ్డెర బస్తీలోని హైటెన్షన్ వైర్లను తొలగించాలని స్థానికులతో కలిసి కార్పొరేటర్ వనం సంగీత, వడ్డెర సంఘం నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. వడ్డెర బస్తీ, శ్రీనగర్ కాలనీ, కేశవరావునగర్‌లో గల హైటెన్షన్ వైర్లను తొలగించాలని డిమాండ్ చేశారు.