calender_icon.png 23 January, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి హైబ్రోన్ చర్చిపై ఆధిపత్య పోరు

23-01-2025 07:27:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముషీరాబాద్ హైబ్రోన్ చర్చి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హైబ్రోన్ చర్చిపై ఆధిపత్య కోసం  రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. పాస్టర్ వీరాచారి వర్గం చర్చిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టి, చర్చిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 100 మంది పోలీసులు మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాగా, గతకొంత కాలంగా హైబ్రోన్ చర్చిపై హక్కు కోసం రెండు వర్గాల మధ్య పోరు సాగుతోంది. సొసైటీ సభ్యులు చర్చిని స్వాధీనం చేసుకొని, తామను ప్రార్ధనలకు అనుమతించడంలేదంటూ ట్రస్ట్ సభ్యులు ఇటీవల ఆరోపించారు. ఇవాళ ప్రార్ధనలు చేస్తామంటూ వచ్చిన ట్రస్ట్ సభ్యులను లోపలికి అనుమతించకుండా పాస్టర్ వీరాచారి వర్గం లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారు. దీంతో ట్రస్ట్ సభ్యులు గేటు బద్దలు కొట్టి హైబ్రోన్ చర్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరకుని అడ్డుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.